: వన్ ర్యాంక్, వన్ పెన్షన్ అటకెక్కినట్టేనా?


మాజీ సైనికోద్యోగులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తాత్కాలికంగా అటెకెక్కినట్టేనా? అంటే, అవునే అంటున్నారు మాజీ సైనికులు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయడంలో సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు మరికొంత సమయం కావాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. డిల్లీలో ఆయన మాట్లాడుతూ, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీం అమలు చేసేందుకు మరింత సమయం కావాలని అన్నారు. 1965లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 వసంతాలు పూర్తైన సందర్భంగా నేడు ప్రకటన రానుందంటూ మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సైనికులు తీవ్ర నిరాశ చెందారు. కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికుల ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News