: పర్యావరణ అంశాలపైనా బాలీవుడ్ సినిమాలు రావాలి: అమోల్ పాలేకర్


బాలీవుడ్ లో ఫిలిం మేకర్లు పర్యావరణ అంశాల ఆధారంగా సినిమాలు తీయాలని భారత ఆస్కార్ జ్యూరీ చైర్మన్ అమోల్ పాలేకర్ ఆకాంక్షించారు. ఇప్పటిదాకా ఈ విభాగాన్ని బాలీవుడ్ అంటరానిదానిలా చూస్తోందని, ఇకపై ఈ పరిస్థితిలో మార్పు రావాలని పాలేకర్ అన్నారు. కొన్ని ఉపయుక్తమైన అంశాల విషయంలో వివక్ష వీడాలని ఈ నట దర్శకుడు పిలుపునిచ్చారు. పర్యావరణంపై సినిమాలు తీస్తే తాను ఎంతో ఆనందిస్తానని తెలిపారు. రానున్న ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఉత్తమ విదేశీ చిత్రం పోటీ విభాగానికి పంపే భారతీయ ఎంట్రీ ఎంపిక కోసం ఏర్పాటైన జ్యూరీ చైర్మన్ గా ఇటీవలే పాలేకర్ నియమితుడయ్యారు. 'ఆ ప్రతిష్ఠాత్మక అవార్డును తానొక్కడినే తీసుకువస్తానని అందరూ భావిస్తున్నారని, అయితే, జ్యూరీలో తనతో పాటు మరో 16 మంది సభ్యులు ఉన్నారని, తమ పని ఆస్కార్ కు వెళ్లే స్థాయి ఉన్న భారతీయ సినిమాను ఎంపిక చేయడమేనని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News