: హిజ్రాల ఔదార్యం... రైల్లో గర్భిణికి పురుడుపోసిన వైనం


రైళ్లలో హిజ్రాల స్వైర విహారం నానాటికీ పెరిగిపోతోందని గగ్గోలు పెట్టేవారికి ఈ వార్త షాక్ కలిగిస్తుంది. రైల్లోకెక్కి పురిటి నొప్పులతో సతమతమవుతున్న ఓ నిండు గర్భిణికి హిజ్రాలు పురుడు పోశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లిని, బిడ్డతో పాటు ఆసుపత్రిలో చేర్చిన హిజ్రాలు అందరి చేత ప్రశంసలందుకున్నారు. నల్లగొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘోరక్ పూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రాగా హిజ్రాలు రైల్లోనే పురుడుపోశారు. ఆ తర్వాత తల్లీబిడ్డలను ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News