: లాభాలతో ముగిసిన మార్కెట్లు... స్వల్పంగా బలహీనపడ్డ రూపాయి
ఓ రోజు లాభం.. మరునాడే నష్టం.. ఆ మరునాడు మళ్లీ లాభం... ఇదీ ‘డ్రాగన్’ దెబ్బతో భారత మార్కెట్ల పరిస్థితి. ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీ కుదుపునకు గురి కాగా భారత మార్కెట్లపై మాత్రం ఆ స్థాయి ప్రభావం పడలేదు. కొద్దిసేపటి క్రితం ముగిసిన మార్కెట్లు లాభాలనే నమోదు చేశాయి. నేటి ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు లాభాలతోనే ముగియడం విశేషం. సెన్సెక్స్ 161 పాయింట్లు లాభపడి 26,392 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 53 పాయింట్లు లాభపడి 8,001 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే డాలర్ తో రూపాయి మారకం విలువ మాత్రం స్వల్పంగా క్షీణించింది. 14 పైసల మేర క్షీణించిన రూపాయి రూ.66.13 వద్ద కొనసాగుతోంది.