: వేర్పాటువాదుల ఇలాకాలో రాహుల్ గాంధీ...శ్రీనగర్ లాల్ చౌక్ లో టీ బ్రేక్
జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాశ్మీరీ వేర్పాటువాదులకు షాకిచ్చారు. శ్రీనగర్ పర్యటన సందర్భంగా వేర్పాటువాదులకు మంచి పట్టు ఉన్న మైసుమా ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అంతేకాక అక్కడికి సమీపంలోని లాల్ చౌక్ లో ఆయన టీ బ్రేక్ తీసుకున్నారు. కరుడుగట్టిన వేర్పాటువాద నేత జేకేఎల్ఎఫ్ చైర్మన్ యాసిన్ మాలిక్ కు మంచి పట్టున్న ఈ ప్రాంతంలో ఆగిన రాహుల్ గాంధీ, నేరుగా ఓ టీ కొట్టు వద్దకు వెళ్లి టీ, బిస్కెట్లు కొనుక్కున్నారు. రద్దీగా ఉన్న మార్కెట్ లోకి ఉన్నట్టుండి రాహుల్ ప్రవేశించడంతో ఆయన భద్రతా సిబ్బంది అయోమయానికి గురయ్యారు. అయితే రాహుల్ వెనువెంటనే తిరిగిరావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.