: పాక్ ను ‘ఉగ్ర’ దేశంగా ప్రకటించండి: ప్రపంచ దేశాలకు కాశ్మీర్ డిప్యూటీ సీఎం విజ్ఞప్తి


సరిహద్దుల్లో అమల్లో ఉన్న కాల్పుల విరమణను యథేచ్చగా ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. పాక్ సైన్యం కాల్పుల్లో గాయపడి జమ్మూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కొద్దిసేపటి క్రితం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు తూట్లు పొడుస్తూ పాక్ దాడుల దౌత్యాన్ని నడుపుతోందని ధ్వజమెత్తారు. ‘‘పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది. అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు ఆ దేశం ఉగ్రవాదాన్నే ఆయుధంగా వాడుతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నేటి ఉదయం పాక్ జరిపిన దాడుల్లో ముగ్గురు పౌరులు చనిపోగా, 17 మందికి గాయాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News