: ఆ విషయం తెలుసు కాబట్టే ధోనీ తప్పుకున్నాడు: రవిశాస్త్రి
టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంఎస్ ధోనీ సరైన సమయంలో తప్పుకున్నాడని టీమ్ డైరక్టర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. కొలంబోలో ఆయన మీడియాతో మాట్లాడారు. "మూడు ఫార్మాట్లలో ఆడడం ధోనీకి చాలా కష్టం. దానికి తోడు, టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి ఒకరు (కోహ్లీ) సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా అతనికి తెలుసు. అందుకే మరేమీ ఆలోచించకుండా ఐదు రోజుల ఫార్మాట్లో సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. ధోనీ ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో ఇప్పుడందరికీ అర్థమవుతుందనుకుంటా" అని వివరించారు. ఆసీస్ టూర్ సందర్భంగా టీమిండియాలో లుకలుకలు తలెత్తాయని, జట్టులో గ్రూపిజం నెలకొందని, ధోనీకి, కోహ్లీకి పొసగడం లేదని మీడియాలో కథనాలు రావడం తెలిసిందే.