: టెన్షన్ తగ్గుతోంది... గుజరాత్ లో పలు ప్రాంతాలలో కర్ఫ్యూ ఎత్తివేత


పటేళ్ల ‘కోటా’ పోరుతో అగ్నిగుండంలా మారిన గుజరాత్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. మొన్న రాత్రి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదు. అంతకుముందు రోజు ఉద్రిక్తతను అదుపు చేసేందుకంటూ పోలీసులు యువ సంచలనం హార్దిక్ పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పటేల్ యువత మరింత రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే అల్లర్లు ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాదు దాకా విస్తరించాయి. రెండు రోజులుగా జరిగిన ఘర్షణల్లో పది మంది మరణించారు. హార్దిక్ పటేల్ ను నిర్బంధం నుంచి విడిచిపెట్టిన దరిమిలా రాష్ట్రంలో పరిస్థితి సద్దుమణుగుతోంది. దీంతో అహ్మదాబాదులోని మూడు ప్రాంతాల్లో నేటి ఉదయం కర్ఫ్యూను ఎత్తివేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే కర్ఫ్యూను ఎత్తివేసినా, నగరంలోని పలు ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలు ముందు జాగ్రత్త చర్యగా కవాతు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News