: కాంగ్రెస్ పార్టీ నాకేం ఇచ్చింది... నా టాలెంట్ గుర్తించే కేసీఆర్ పదవి ఇచ్చారు: డీఎస్


మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన సీనియర్ నేత డి.శ్రీనివాస్ అదే పార్టీపై విమర్శలు గుప్పించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. తన ప్రతిభను గుర్తించే కేసీఆర్ తనకు ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు. బంగారు తెలంగాణ సాధించేవరకు కేసీఆర్ రిటైర్ కారని... గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News