: టీడీపీ జాతీయ కార్యదర్శి పదవి చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించిన నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని చేపట్టబోతున్నారంటూ తనపై వస్తున్న వార్తలను ఆ పార్టీ యువనేత, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ఖండించారు. ఇప్పటికిప్పుడే నాయకత్వ బాధ్యతల కోసం తాను తొందరపడటం లేదని ఆయన తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన పనులను నిర్వహించడమే ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని లోకేష్ చెప్పారు. ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.