: చంద్రబాబు వద్దన్నా నేనే ఆ పని చేయించా... పవన్ మాట వింటాం: ఏపీ మంత్రి నారాయణ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదటి నుంచీ భూసేకరణ వద్దనే అంటున్నారని, అయినా సమయం ముంచుకొస్తుండటంతో తాను భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయించానని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. భూసేకరణకు చంద్రబాబు వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమీకరణ విధానంలోనే రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలన్నదే ఆయన అభిమతమని తెలిపారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా భూములిచ్చేందుకు అందరు రైతులనూ ఒప్పిస్తామని, వారి ఇష్ట ప్రకారమే భూములు తీసుకుంటామని, ఎవరినీ బలవంతం పెట్టబోమని వివరించారు. గ్రామకంఠాలపై రైతుల్లో ఆందోళన వద్దని, సోమవారంలోగా సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.