: యువ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు అత్యాచారాలపై ప్రత్యేక శిక్షణ... 'ఎఫ్ఏక్యూ'లో ప్రశ్నలకు సమాధానాలివే!
ఇస్లామిక్ రాజ్య స్థాపన పేరిట ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్న దారుణ మారణకాండ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే, తాము కిడ్నాప్ చేసిన చిన్నారులను కర్కోటకులుగా, కిరాతకులుగా తయారు చేసేందుకు వాళ్లు ఇస్తున్న శిక్షణ, చేయిస్తున్న పనులు మానవాళికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. క్రిస్టియన్లను మూకుమ్మడిగా చంపడం, భవనాలపై నుంచి స్వలింగ సంపర్కులను తోసేసి చంపడం, పురాతన కట్టడాల ధ్వంసం, బహిరంగ, సామూహిక అత్యాచారాలు, మనుషులను చంపడానికి హేయమైన పద్ధతులు వాడటం... ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు తాజాగా యువ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు శిక్షణలో భాగంగా అత్యాచారాలపై శిక్షణ మొదలు పెట్టారు. ఇందుకోసం పుస్తకాలు ముద్రించారు. థియరీలు చెబుతున్నారు, ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. వారికొచ్చే సలహాలు తీర్చడం కోసం, ఎఫ్ఏక్యూ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్ డ్ క్వశ్చన్స్) పేరిట కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలు చదవడానికే జుగుప్సను కలిగించేలా వున్నాయి. ఇవి తీవ్రవాద యువకుల మనసులను కఠినం చేస్తున్నాయి. మారిన మనసులతో ఈ యువకులు భవిష్యత్తులో ఎటువంటి దారుణాలకు ఒడిగడతారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.