: వచ్చె నెల 9న మార్కెట్లోకి ఐఫోన్ 6ఎస్.... మీడియాకు అందిన ‘యాపిల్’ ఆహ్వానం
స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 6 ఎస్ మార్కెట్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఎప్పటిలానే సెప్టెంబర్ 9నే యాపిల్ కంపెనీ తన కొత్త ఉత్పత్తిని మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు ‘యాపిల్’ పంపిన ఆహ్వాన లేఖలు చేరిపోయాయి. ‘‘హే సిరి, గివ్ అజ్ ఏ హింట్’’ పేరిట పంపిన ఇన్విటేషన్ లో శాన్ ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని యాపిల్ పేర్కొంది. యాపిల్ కంపెనీ ఇప్పటిదాకా విడుదల చేసిన ఉత్పత్తులన్నీ సెప్టెంబర్ 9నే మార్కెట్ లోకి రంగప్రవేశం చేశాయి. తన పాత సంప్రదాయానికే కట్టుబడిన యాపిల్ ఈ దఫా కూడా తన కొత్త ప్రకటనకు సెప్టెంబర్ 9నే ఎంచుకుంది.