: కోహ్లీ సేనకు షాకిచ్చిన లంక బౌలర్లు...4 ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా


శ్రీలంక, భారత్ ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ కొద్దిసేపటి క్రితం లంక రాజధాని కొలంబోలో ప్రారంభమైంది. మ్యాచ్ ఆరంభంలోనే లంక బౌలర్లు టీమిండియాకు షాకిచ్చారు. తొలి ఓవర్ లో భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ (2)ను లంక ఫేసర్ దమ్మిక ప్రసాద్ పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్ ను నో బాల్ తో మొదలుపెట్టిన దమ్మిక ప్రసాద్ తన రెండో బంతికే లోకేశ్ రాహుల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన అజింక్యా రెహానే (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. నాలుగో ఓవర్ నాలుగో బంతికి నువాన్ ప్రదీప్ కు వికెట్ల ముందు రెహానే దొరికిపోయాడు. దీంతో నాలుగు ఓవర్లు పూర్తి కాకుండానే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి భారత్ 15 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News