: ఇంటింటికీ తిరిగి సినిమా టికెట్లు అమ్ముకుంటున్న 'హాట్ బాంబ్' పూనమ్ పాండే
"టికెట్లండోయ్ టికెట్లు... మాలినీ అండ్ కో సినిమా టికెట్లు..." అంటూ బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఇల్లిల్లూ, వీధి వీధీ తిరుగుతోంది. ఆమె నటించిన తాజా చిత్రం థియేటర్లను తాకనున్న నేపథ్యంలో ప్రచారం కోసం కొత్త అవతారం ఎత్తిందీ 'హాట్ బాంబ్'. ప్రజల్లోకి చిత్రాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించిన దర్శకుడు వీరూ కే, పూనమ్ లు సినిమా టికెట్లను ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయడం ప్రారంభించారు. బజారుల్లో తిరుగుతూ టికెట్లను అమ్ముతున్నారు. పూనమ్ దగ్గర టికెట్లను కొనేందుకు జనాలు ఎగబడుతున్నప్పటికీ, ఈ కొత్త ప్లాన్ సినిమా విజయవంతానికి ఏ మేరకు సహకరిస్తుందో వేచి చూడాల్సిందే.