: సోమవారం నాడు 100 కోట్ల మంది చూసిన ఆ వెబ్ సైట్ ఏంటో తెలుసా?
సరిగ్గా ఐదు రోజుల క్రితం భూమిపై ఉన్న ప్రతి ఏడుగురిలో ఒకరు ఓ వెబ్ సైట్ ను ఓపెన్ చేశారు. ప్రపంచ ఇంటర్నెట్ చరిత్రలో తొలిసారిగా ఈ ఘనత సాధించిన వెబ్ సైట్ ఏంటో తెలుసా? సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్. "సోమవారం నాడు ప్రతి ఏడుగురిలో ఒకరు ఫేస్ బుక్ మాధ్యమంగా తమ స్నేహితులు, బంధువులకు కనెక్ట్ అయ్యారు. ఇది సంస్థ చరిత్రలో కీలక మైలురాయి" అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ప్రపంచమంతటినీ కలిపే క్రమంలో ఇది తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ఫేస్ బుక్ లో 149 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నట్టు పేర్కొన్నారు.