: పాక్ కాల్పులకు బలవుతున్న అమాయక పౌరులు
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, నిత్యమూ రెచ్చిపోతున్న పాక్ మరోసారి తన బుద్ధి చూపింది. ఈ తెల్లవారుఝామున పాక్ సైనికులు జరిపిన కాల్పులకు అమాయక పౌరుడు బలయ్యాడు. బీఎస్ఎఫ్ బలగాల స్థావరాలపైనా, సరిహద్దు గ్రామాలపైనా పాక్ రేంజర్లు విరుచుకుపడటంతో, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రులకు తరలించారు. పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వారికి బుద్ధి చెప్పే పనిలో భారత సైన్యం నిమగ్నమై ఉంది. కాగా, నిన్న సరిహద్దులు దాటి వచ్చిన నలుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టిన సైన్యం, ఒకడిని ప్రాణాలతో పట్టుకున్న సంగతి తెలిసిందే.