: లండన్ లోని అంబేద్కర్ ఇంటిని కొనేసిన భారత్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తాను విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో లండన్ లో నివసించిన ఇంటిని భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ దిశగా, మహారాష్ట్ర మంత్రి రాజ్‌కుమార్ బాడోల్ లండన్ అధికారులతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారని బ్రిటన్ లోని ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్ అండ్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధి వివరించారు. కాగా, 1920 సమయంలో అంబేద్కర్ ఇక్కడ నివసించారు. నార్త్ వెస్ట్ లండన్ లోని కింగ్ హెన్రీ రోడ్డులో 2050 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల్లో ఈ భవంతి ఉంది. దీన్ని కొనుగోలు చేయాలని భారతీయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని రూ. 31 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు డీల్ కుదిరింది. దీనిని విద్యా సాంస్కృతిక కేంద్రంగా మార్చాలన్నది మహారాష్ట్ర సర్కారు అభిమతం.