: చీప్ లిక్కర్ అనొద్దు, ఇది సబ్సిడీ మద్యం: శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్


గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ విమర్శించారు. ప్రభుత్వం మద్యాన్ని సబ్సిడీపై సరఫరా చేస్తుంటే దానికి చీప్ లిక్కర్ అని పేరు పెట్టడం తప్పని అభిప్రాయపడ్డారు. "అది చీప్ లిక్కర్ కాదు. సబ్సిడీ మద్యం" అని అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, గుడుంబా, నాటు సారాలు విషపదార్థాలని, వాటిని ఆపేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రజల క్షేమం కోరి మాత్రమే, తగ్గింపు ధరలకు మద్యం విక్రయాలు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు స్వామిగౌడ్ వివరించారు.

  • Loading...

More Telugu News