: యువ ఎమ్మెల్యే వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు
_5691.jpg)
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య వివాహానికి హాజరయ్యారు. తిరుపతిలో జరిగిన ఈ వివాహానికి విచ్చేసిన చంద్రబాబు వధూవరులను ఆశీర్వదించారు. ఆదిత్య గత ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం సత్యవేడు నుంచి ఆయన బరిలో దిగారు. ఏపీ అసెంబ్లీలో ఆదిత్య పిన్నవయస్కుడు. కాగా, ఆయన వివాహానికి చంద్రబాబు సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదిత్య వివాహానికి హాజరైన అనంతరం, సీఎం చంద్రబాబు నాగలాపురం మండలాధ్యక్షుడి కుమారుడి నిశ్చితార్థానికి హాజరయ్యారు. అనంతరం, ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు.