: రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఉద్యమమే: జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక


రాష్ట్ర విభజన కారణంగా రాయలసీమకు నష్టం జరిగిందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, విభజన అనంతరం ఇస్తున్న ప్యాకేజీలో రాయలసీమకు న్యాయం చేయాలని సూచించారు. లేని పక్షంలో రాయలసీమలో పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాయలసీమను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. రాయలసీమను విస్మరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News