: టాప్ టెన్ లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు


ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు స్థానం సంపాదించుకున్నారు. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో నాలుగో ర్యాంకు దక్కించుకోగా, ఓపెనర్ శిఖర్ ధావన్ ఏడవ ర్యాంకు దక్కించుకున్నాడు. టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో ర్యాంకులో నిలిచాడు. కాగా బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పదవ స్థానం దక్కించుకున్నాడు. టీం ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండో ర్యాంకులో కొనసాగుతోంది. వన్డేల్లో ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 7వ ర్యాంకు దక్కించుకున్నాడు. టీట్వింటీల్లో కోహ్లీ రెండో ర్యాంకు సాధించగా, రైనా పదో ర్యాంకు పొందాడు. బౌలర్లలో అశ్విన్ నాలుగో ర్యాంకులో నిలిచాడు.

  • Loading...

More Telugu News