: అలాంటి బూటకపు రికార్డులు 'బాహుబలి'కి అవసరంలేదు: రాజమౌళి


రికార్డుల కోసం 'బాహుబలి' చిత్రాన్ని ఇంకా కొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ సొంత డబ్బుతో ప్రదర్శిస్తున్నారన్న కథనాలపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. ప్రేక్షకులు ఇప్పటికే 'బాహుబలి'కి ఘనమైన రికార్డులను అందించారని, బూటకపు రికార్డులతో పనిలేదని స్పష్టం చేశారు. "రికార్డుల కోసం పలు సినిమా హాళ్లలో ఎక్కువ రోజులు ప్రదర్శించేందుకు థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లపై కొందరు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. అలాంటి రికార్డులను మేం కోరుకోవడం లేదు. 'బాహుబలి'... రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేయదు. కలెక్షన్లు ఉన్న థియేటర్లలోనే ఇకపై 'బాహుబలి' ప్రదర్శితమవుతుంది" అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News