: ఎదురులేని జమైకా చిరుత... గాట్లిన్ కు మళ్లీ నిరాశే!
బీజింగ్ లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ జోరు కొనసాగుతోంది. మొన్న 100 మీ పరుగులో సత్తా చాటిన బోల్ట్, తాజాగా, 200 మీ పరుగుపందెం ఫైనల్లో విజేతగా నిలిచాడు. 19.55 సెకన్లతో రేసు పూర్తి చేసిన ఈ జమైకా చిరుత మరోసారి జస్టిన్ గాట్లిన్ ను రెండోస్థానానికి పరిమితం చేశాడు. గాట్లిన్ 19.74 సెకన్లతో ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 100 మీ స్ప్రింట్ ఫైనల్లోనూ గాట్లిన్... బోల్ట్ ధాటికి నిరాశకు గురికాక తప్పలేదు.