: ఐక్యరాజ్యసమితి ముందు అద్భుతంగా నటిస్తున్న పాకిస్థాన్


కుట్రలు, కుతంత్రాల్లో ఆరితేరిన పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్ధి బయటపెట్టుకుంది. కాశ్మీరీ వేర్పాటు వాదులతో సమావేశంపై పట్టుబట్టిన పాకిస్థాన్, అందుకు భారత్ అంగీకరించకపోవడంతో జాతీయ భద్రతాధికారుల సమావేశాన్ని రద్దు చేసుకుంది. ఏకపక్షంగా సమావేశం రద్దు చేసుకున్న పాకిస్థాన్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను వేలెత్తి చూపడానికి ప్రయత్నిస్తోంది. భారత్ వైఖరి కారణంగానే జాతీయ భద్రతాధికారుల సమావేశం రద్దు చేసుకోవాల్సి వచ్చిందిని ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని, భారత సైన్యం 130 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందని, దీని కారణంగా 16 మంది పాకిస్థానీలు మృత్యువాతపడితే, 60 మంది వరకు గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన ఐక్యరాజ్యసమితి రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News