: తాడుతో సెల్ టవరెక్కిన సర్పంచ్...ఉరేసుకుంటానని బెదిరింపులు


కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గుమ్లాపూర్ సర్పంచ్ పై ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణకు ఆయనను స్టేషన్ కు పిలిచారు. అనంతరం కేసు పెట్టిన వ్యక్తి, ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. అయినప్పటికీ తనను వేధిస్తున్నారంటూ సర్పంచ్ ఆందోళన బాటపట్టాడు. ఇందులో భాగంగా ఉరి వేసుకుంటానంటూ గ్రామంలోని సెల్ టవర్ పైకి తాడుతో చేరుకున్నాడు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఉరి వేసుకుంటానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనతో చర్చిస్తున్నారు. కిందికి దిగిరావాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News