: గులాబీలు గుచ్చుకుంటున్నాయ్...!
గులాబీలు గుచ్చుకోవడమేంటని అనుకుంటున్నారా? అవును... హైదరాబాదు మార్కెట్ లో పూలు కొనేందుకు వెళ్లే వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. రేపు శ్రావణ శుక్రవారం కావడంతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. శ్రావణ లక్ష్మిని కొలిచేందుకు ప్రతి ఒక్కరూ పూలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పూలకు డిమాండ్ పెరిగింది. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో నిన్న మొన్నటి వరకు యాభై లేదా అరవై రూపాయలకు దొరికే పూలు ఇప్పుడు వందలకు చేరుకున్నాయి. కేజీ బంతిపూలు కావాలంటే 100 నుంచి 200 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. కేజీ చామంతులు కావాలంటే 500 ఖర్చు చేయాల్సిందే. గులాబీలు 400 రూపాయల ధర పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు పూలు ముల్లులా గుచ్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.