: తెలంగాణను పింక్ 'బార్'లా మార్చాలని కేసీఆర్ చూస్తున్నారు: రావుల


తెలంగాణ రాష్ట్రాన్ని పింక్ బార్ లా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యత్నిస్తున్నారని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎక్కడ పడితే అక్కడ బార్లు ప్రారంభించేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, రాష్ట్రంలో మద్యం ఏరులై ప్రవహింపజేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతలు సమావేశమయ్యారు. అనంతరం రావుల మాట్లాడుతూ, చిప్ లిక్కర్ వ్యతిరేక కార్యాచరణపై సమావేశంలో చర్చించామని తెలిపారు. సెప్టెంబర్ 3న చీప్ లిక్కర్ కు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళల ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News