: ఎవరికీ ఏ స్థానం సొంతం కాదు... పరిస్థితిని బట్టి నిర్ణయాలుంటాయి: రవిశాస్త్రి


శ్రీలంకతో చివరి టెస్టుకు ముందు కొలంబోలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదని, పరిస్థితిని బట్టి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు. పరిస్థితిని అనుసరించి ఎవరి అవసరం ఉంటుందో వారినే బ్యాటింగ్ కు పంపుతామని, బౌలింగ్ విభాగానికీ ఈ సూత్రం వర్తిస్తుందని వివరించారు. గాలే టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలో దిగామని, కొలంబో టెస్టులోనూ అందులో మార్పులేదని అన్నారు. గత టెస్టులో ఆడిన విధంగా చివరి టెస్టులోనూ సరైన క్రికెట్ ఆడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News