: జీఎస్ఎల్వీ-డీ6 సక్సెస్... శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు


భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ఘనతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజనిక్ టెక్నాలజీని ఉపయోగించి జీఎస్ఎల్వీ-డీ6 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. దాదాపు 50 మీటర్ల పొడవున్న జీఎస్ఎల్వీ-డీ6 బరువు 416 టన్నులు. ఈ రాకెట్ తనతో పాటు జీశాట్-6 అనే మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ను భూస్థిర కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ అతిపెద్ద యాంటెనాను కలిగి ఉంటుంది. ఈ యాంటెనా ఒక గొడుగు ఆకారంలో విచ్చుకొని ఉంటుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారతదేశానికి చెందిన వివిధ సాయుధ బలగాలు ఒకదానితో మరొకటి సమాచారాన్ని పంచుకునే వీలు కలుగుతుంది. జీఎస్ఎల్వీ-డీ6 ప్రయోగం విజయవంతం కావడంతో షార్ లోని శాస్త్రవేత్తలు సంతోషంలో మునిగిపోయారు. శాస్త్రవేత్తల కృషిని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ కొనియాడారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News