: కొత్తగా పుట్టుకొచ్చిన భయం 'నోమో ఫోబియా'... మీకు ఉందా?
చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ను వదల్లేకపోతున్నారా? డేటా ప్యాకేజీ అయిపోతే అసహనం పెరుగుతోందా? వై-ఫై సిగ్నల్ రాకుంటే భరించలేరా? అయితే మీరు కొత్తగా కనిపెట్టిన 'నోమోఫోబియా'తో బాధపడుతున్నట్టే! ప్రపంచ యువతను కొత్తగా పట్టుకున్న ఓ రకం భయమిది. దీన్నిఅమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్, ఓ విద్యార్థి కలిసి పరిశోధనలు చేసి కనుగొన్నారు. వారి పరిశోధనలో భాగంగా, పలువురిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఫోనుకు డేటా అందకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్ట్ కాకుంటే ఏదో కోల్పోయినట్టే. ప్రపంచంలో ఏం జరుగుతుందో తక్షణం తెలుసుకోలేకుంటే అసహనంగా ఉంటుంది... ఇటువంటి సమాధానాలు అధికంగా వస్తే 'నోమో ఫోబియా' ఉన్నట్టు తేల్చారు. మరి మీకు కూడా ఈ తరహా ఫోబియా ఉందా? మీకు మీరుగానే ఓసారి చెక్ చేసుకోండి!