: ఆమె పేరు ఇంద్రాణి కాదు... దాస్, ఖన్నా, ముఖర్జియాలతో పాటు ఆమె జీవితంలో నాలుగో వ్యక్తి!


షీనా బోరా హత్యోదంతం తరువాత క్షణానికో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఓ కార్పొరేట్ కంపెనీలో చీఫ్ గా పనిచేస్తున్న పీటర్ ముఖర్జియా భార్యగా మాత్రమే పరిచయమైన ఇంద్రాణి జీవితంలో ఎవరికీ తెలియని ఎన్నో కొత్త కోణాలున్నాయి. అసలామె పేరు ఇంద్రాణి కాదట. ఆమె అసలు పేరు పారీ బోరా. ఆమె ఉపేన్ బోరా కుమార్తె. అందుకే షీనా పేరులో బోరా తొలగిపోలేదు. తన 16వ ఏట వరకూ గౌహతీ పరిధిలోని సుందర్ నగర్ లో తల్లిదండ్రులతో కలసి నివసించిన పారీ బోరా 1988లో ఇల్లు విడిచి పారిపోయింది. ఎక్కడికి వెళ్లిందో అప్పట్లో ఎవరికీ తెలియదు. రెండేళ్ల తరువాత 1990లో తిరిగి ఇంటికి వచ్చిన ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వారే షీనా, మఖాయిల్. అంటే, ఆమెకు చాలా చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు కలిగారని తెలుస్తోంది. వీరిద్దరూ సిద్ధార్థ దాస్ కు, తనకు పుట్టారని ఆమె చెప్పుకోగా, వీరిద్దరికీ తాను తండ్రిని కాదని దాస్ వాదించేవాడని తెలుస్తోంది. ఈ విషయంలో డీఎన్ఏ పరీక్షలకూ సిద్ధపడ్డాడు. దాస్, పారీ విడిపోవడానికి కూడా ఇదే కారణమని సమాచారం. గొడవలెందుకని అనుకున్న పారీ, పిల్లల పేర్ల చివర 'దాస్' అన్న పదం కలపకుండా 'బోరా' అనే ఉంచింది. ఆ తరువాత తన 19వ ఏట సంజీవ్ ఖన్నా ను ఇంద్రాణి పేరిట పరిచయం చేసుకుంది పారీ. ఇద్దరూ ప్రేమలో పడి వివాహం చేసుకోవాలని భావించారు. తన తొలి వివాహం గురించి చెప్పకుండానే 1993లో సిద్ధార్థ దాస్ తో విడాకులు తీసుకుని సంజీవ్ ను వివాహం చేసుకుంది. సిద్ధార్థతో తెగతెంపుల తరువాత పీటర్ ముఖర్జియాకు దగ్గరైంది. అంటే, సంజీవ్ ఖన్నా, సిద్ధార్థ దాస్, పీటర్ ముఖర్జియాలు కాకుండా మరో వ్యక్తి ఇంద్రాణి జీవితంలో ఉన్నాడు. అతడు షీనా, మిఖాయిల్ లకు తండ్రి కావచ్చు. మరి ఆ నాలుగో వ్యక్తి ఎవరన్నది ఇప్పటికి మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నే!

  • Loading...

More Telugu News