: ప్రాణాలతో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది పేరు 'సజ్జాద్ అహ్మద్'... వివరాలు


పాక్ ఉగ్రవాదుల చొరబాట్లను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అంతేకాదు, ముష్కరులను సజీవంగా పట్టుకోవడంలో కూడా ఊహించని విజయాలు సాధిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఉధంపూర్ లో స్థానికుల సహాయంతో ఉగ్రవాది నవేద్ ను సజీవంగా పట్టుకున్న సైన్యం... కొద్దిరోజులు కూడా తిరక్కుండానే మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకుంది. తాజాగా ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో కాసేపటి క్రితం ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. మరో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అతన్ని విచారించిన భద్రతాబలగాలు ప్రాథమిక సమాచారాన్ని సేకరించాయి. పట్టుబడిన ఉగ్రవాది పేరు సజ్జాద్ అహ్మద్. వయసు 22 సంవత్సరాలు. పాకిస్థాన్ లోని బలోచ్ ప్రాంతంలోని ముజఫర్ ఘర్ కు చెందిన వాడు. ఉగ్రవాది సజ్జాద్ ను ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారు. అనంతరం ఆ ముష్కరుడిని శ్రీనగర్ కు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News