: భారత విద్యార్థుల సమస్యలను జర్మనీ విద్యా శాఖ మంత్రికి తెలిపిన సుష్మా


జర్మనీ పర్యటన సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విద్యార్థుల సమస్యలపైనా దృష్టి పెట్టారు. జర్మనీ విద్యా శాఖ మంత్రి జొహాన్నా వాంకాతో చర్చల సందర్భంగా భారత విద్యార్థుల సమస్యలను వివరించారు. జర్మనీలో భారత విద్యార్థులు నివాస స్థితి, వీసా పునరుద్ధరణ, వసతి తదితర అంశాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని సుష్మా జర్మనీ విద్యా శాఖ మంత్రిని కోరారు. గత కొన్నేళ్లుగా జర్మనీలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 10 వేల మందికి పైగా భారత విద్యార్థులు జర్మనీలో విద్యాభ్యాసం చేస్తుండగా, భారత్ లో 800 వరకు జర్మనీ విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం పెంపొందించుకునే క్రమంలో భారత్ లో హ్యూమానిటీస్, సోషల్ సైన్స్ వంటి అడ్వాన్స్డ్ స్టడీస్ కోసం ఓ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని జర్మనీ విద్యా శాఖ మంత్రి వాంకా... సుష్మా స్వరాజ్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News