: టి.అసెంబ్లీ కార్యదర్శి సదారాం సర్వీసు పొడిగింపుపై కాంగ్రెస్ అభ్యంతరం
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగుతున్న సదారాం సర్వీసును గత కొన్నేళ్ల నుంచి కొనసాగించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సంవత్సర పదవీకాలం ముగియడంతో మరోసారి పొడిగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారన్నారు. సదారాం కాకుండా వేరొకరికి అవకాశం దక్కేలా నిర్ణయం తీసుకోవాలని సీఎంను కోరారు. కాగా స్పీకర్, మండలి ఛైర్మన్ ను సదారాం తప్పుదోవ పట్టించారని, అంతేకాకుండా విదేశీ పర్యటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అసలాయన 2013లోనే రిటైర్ అయితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పదవీకాలాన్ని పొడిగించారన్నారు. అది కూడా ముగియడంతో తెలంగాణ సీఎం 2014లో మరో ఏడాది పాటు పొడిగించారని చెప్పారు.