: మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీని అరెస్ట్ చేయండి: పాక్ కోర్టు
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. గిలానీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పాకిస్థాన్ లో అవినీతి కేసులను విచారించే ఓ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గిలానీతో పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత మఖ్దూమ్ అమిన్ ఫహిమ్ ను కూడా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి నమోదైన 12 కేసుల్లో... గిలానీపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.