: గుజరాత్ లో అల్లర్లు చెలరేగడానికి సగం కారణం పోలీసులే... విచారణకు ఆదేశించిన హైకోర్టు
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పటేల్ వర్గం ప్రజల బహిరంగ సభ అనంతరం జరిగిన విపరీత పరిమాణాల వెనుక పోలీసుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ లోని షాహీబాగ్ సమీపంలో ఓ అపార్టుమెంట్ గేటును బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన 20 మందికి పైగా పోలీసులు అక్కడున్న కార్లను, బైకులను ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలన్నీ అపార్టుమెంట్ ప్రాంగణంలో అమర్చిన సీసీ కెమెరాలకు చిక్కాయి. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన పోలీసులే ఇలా రాత్రివేళ వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న గుజరాత్ హైకోర్టు విచారణకు ఆదేశించింది.