: ప్యాకేజీ తీసుకొనే రోజాకే బాగా తెలుసు: టీడీపీ మహిళా నేత అనురాధ


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ప్యాకేజీ తీసుకొనే ఎమ్మెల్యే రోజాకే ప్యాకేజీల గురించి బాగా తెలుసునని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. అసలు రాజధానికి ఎంత భూమి కావాలన్న విషయంపై ఆ పార్టీకి అవగాహన లేదన్నారు. వాన్ పిక్ పవర్ ఇండస్ట్రీస్ కు అప్పట్లో వైఎస్ ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారో రోజా తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా జగన్ పై 11 చార్జ్ షీట్లు ఎందుకున్నాయో కూడా తెలుసుకుంటే బాగుంటుందని సూచించారు. అధికారం కోసమే జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని అనురాధ ఆరోపించారు.

  • Loading...

More Telugu News