: ఎన్డీయే సర్కారుపై మరోసారి ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కారుపై ధ్వజమెత్తారు. కొద్దిమంది వ్యాపారవేత్తల కోసమే సర్కారు పనిచేస్తోందని మండిపడ్డారు. "పూరా దేశ్ కా కిసాన్ ఆజ్ ముష్కిల్ మే ఫన్సా హువా హై, సర్కార్ జో బనీ హై వో దో తీన్ బడే బిజినెస్ మెన్ కి సర్కార్ హై. (దేశ వ్యాప్తంగా రైతులందరూ కష్టాల్లో ఉన్నారు. కానీ, సర్కారు మాత్రం ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తల కోసమే పనిచేస్తోంది)" అని దుయ్యబట్టారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ పుల్వామా జిల్లాలో రైతుల సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం బాలాకోట్ చేరుకున్న ఆయన పాక్ దళాల కాల్పుల్లో గాయపడిన వ్యక్తులను పరామర్శించారు.