: షీనా కనిపించకుండా పోయినప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: రాహుల్ ను ప్రశ్నించిన పోలీసులు
ఊహించని మలుపులు తిరుగుతూ, సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన షీనా బోరా హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్ పోలీసులు మరోసారి ప్రశ్నించారు. నిన్న రాత్రి కూడా అతడిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో, షీనా కనిపించకుండా పోయినప్పుడు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. దాదాపు సంవత్సరం పాటు షీనా బోరా, రాహుల్ ముఖర్జియాలు రిలేషన్ షిప్ లో ఉన్నారు. పీటర్ ముఖర్జియాకి రాహుల్ కుమారుడు కాగా... పీటర్ భార్య ఇంద్రాణి ముఖర్జియాకి షీనా కుమార్తె అవుతుంది. తన తొలి భర్త ద్వారా ఇంద్రాణికి షీనా జన్మనిచ్చింది. ఇంద్రాణికి పీటర్ మూడవ భర్త.