: గుజరాత్ హోంమంత్రి ఇంటికి నిప్పు... ఉద్ధృతంగా పటేల్ ల ఆందోళన
పటేళ్ల ఆందోళనతో గుజరాత్ అగ్నిగుండంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ధృతంగా మారిన వారి ఆందోళన ఆ రాష్ట్ర హోంమంత్రి ఇంటిని సైతం తాకింది. ఈ రోజు కొంతమంది ఆందోళనకారులు హోంమంత్రి రజనీ పటేల్ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ సమయంలో ఆయన ఇల్లు కొంతమేర కాలినట్టు తెలిసింది. ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్న పటేళ్ల ఆందోళనను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు బలగాలు ప్రయత్నిస్తున్నాయి.