: బీజేపీకి షాకిచ్చిన అకాలీదళ్... పంజాబ్ వర్సిటీ ఎన్నికల్లో ‘ఎస్ఓఐ’ విజయభేరీ


పంజాబ్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (స్టూడెంట్ కౌన్సిల్) ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారీ అంచనాలతో రంగంలోకి దిగిన ఆ పార్టీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఘోర పరాజయం పాలైంది. శిరోమణి అకాలీదళ్ కు చెందిన విద్యార్థి విభాగం ‘స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆప్ ఇండియా’ చేతిలో ఏబీవీపీ నేతలంతా ఓటమి పాలయ్యారు. పంజాబ్ వర్సిటీలోనే కాక ఆ వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లోనూ ఎస్ఓఐ జెండా ఎగురవేసింది. అంతేకాక అన్ని పోస్టుల్లోనూ ఏబీవీపీ నేతలు ఓడిపోయారు. వర్సిటీ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన ఎస్ఓఐ నేత జాస్మిన్ కాంగ్ కు 3,731 ఓట్లు పోలవగా, ఏబీవీపీ అభ్యర్థి బల్జిందర్ సింగ్ కు కేవలం 1,436 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఎస్ఓఐకి చెందిన రిషి భరద్వాజ్, స్వాతి తివానా వరుసగా ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News