: విదేశాల్లో పర్యటించడం తప్ప మోదీ చేసిందేమీ లేదు: గుత్తా
14 నెలల తన పరిపాలనలో విదేశాల్లో పర్యటించడం తప్ప ప్రధాని మోదీ చేసిందేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. మతతత్వాన్ని రెచ్చగొడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మోదీ యత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీల నియోజకవర్గాల్లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు పర్యటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అవినీతి ఆరోపణలతో బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని... తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు.