: తెలంగాణకు నిరాశ... రెండే 'స్మార్ట్ సిటీ'లు!
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాతో తెలంగాణకు కొంత నిరాశే మిగిలింది. ఆంధ్రప్రదేశ్ కు 3 స్మార్ట్ నగరాలను ప్రకటించిన ఆయన, తెలంగాణకు కేవలం రెండింటితో సరిపెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్ నగరాన్ని ఈ జాబితాలో చేర్చారు. వరంగల్ తో పాటు కరీంనగర్, నిజామాబాద్ పట్టణాలు 'స్మార్ట్' హోదా కోసం పోటీ పడ్డప్పటికీ, వాటికి చోటు దక్కలేదు. పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన 6 నగరాలను జాబితాలో చేర్చిన కేంద్రం, తెలంగాణకు సరైన న్యాయం చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి.