: ఆంధ్రప్రదేశ్ లో 'స్మార్ట్ సిటీ'లు ఇవే!


ఈ మధ్యాహ్నం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మూడు నగరాలు స్థానం సంపాదించుకున్నాయి. కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు రాష్ట్రం నుంచి స్మార్ట్ సిటీలుగా ఎదగనున్నాయి. ఈ నగరాల అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రానున్నాయి. వీటితో పాటు కర్ణాటకలోని శివమొగ్గ, మంగళూరు, బెళగావి, దావణగెరె నగరాలు, ఢిల్లీ పరిధిలోని ఎన్ఎండీసీ ప్రాంతం జాబితాలో చోటు దక్కించుకున్నాయి. స్మార్ట్ సిటీల పూర్తి జాబితా వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News