: రాత్రిలోగా లోపాలన్నీ సరిచేయాల్సిందే...గుంటూరు ఆసుపత్రి వైద్యులకు మంత్రి దేవినేని క్లాస్


గుంటూరు ఆసుపత్రిలో మూషికాల దాడిలో చిన్నారి దుర్మరణం ఏపీ మంత్రివర్గాన్ని కలవరపాటుకు గురి చేసింది. నేటి ఉదయం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొద్దిసేపటి క్రితం ఏపీ జలనవరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు లోపాలను గుర్తించారు. వెనువెంటనే సంబంధిత వైద్యాధికారులను పిలిచి ఓ మోస్తరులో క్లాస్ పీకారు. ఎంతకాలం పనిచేశామన్నది కాకుండా, ఎంత మంచిగా సేవలందించామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. అంతేకాక తాను మళ్లీ రాత్రికి వస్తానని, అప్పటిలోగా లోపాలన్ని సరి చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి మరీ ఆయన అక్కడి నుంచి కదిలారు.

  • Loading...

More Telugu News