: మంత్రాలయంలో భారీ వర్షం, తుంగభద్రకు జలకళ
ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం పరిసర ప్రాంతాలు భారీ వర్షంలో తడిసి ముద్దయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్లవంక వాగు పొంగి పొర్లగా, ఎమ్మిగనూరు వైపు వెళ్లాల్సిన వాహనాలు నాలుగు గంటలకు పైగా నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ వాగు నీరు తుంగభద్ర నదిలో కలసి సుంకేసుల రిజర్వాయర్ వైపు పరుగులు పెడుతుండటంతో, తుంగభద్ర జలకళతో కనిపించింది. కాగా, సిరిమట్టం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి వరద నీటిని పరిశీలించారు.