: ఈ నెల 29న తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయండి: బొత్స


ఈ నెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే బంద్ చేపట్టామని, పార్టీ బలోపేతం కోసం తలపెట్టిన బంద్ కాదని మీడియా సమావేశంలో వివరించారు. ఈ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ బంద్ ను రాష్ట్రానికి రక్షా బంధన్ దినోత్సవంగా చేయాలని బొత్స పిలుపునిచ్చారు. తమ బంద్ కు వామపక్షాలు మద్దతు తెలిపాయన్నారు. కాగా ఆరోజు రాఖీ పౌర్ణమి ఉన్నందున బంద్ పై పునరాలోచించుకోవాలని పలువురు కోరినప్పటికీ వైసీపీ నిర్ణయాన్ని మార్చుకోలేదు.

  • Loading...

More Telugu News