: తక్కువ డేటాతో కాల్ సదుపాయం... వాట్స్ యాప్ కొత్త అప్ డేట్స్ ఇవే!


ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆధారిత స్మార్ట్ ఫోన్లలో వాడే సామాజిక మాధ్యమం వాట్స్ యాప్ సరికొత్త అప్ డేట్స్ తో వచ్చింది. ఇంతవరకూ కేవలం గ్రూప్ నోటిఫికేషన్లను 'మ్యూట్' చేసుకునే సదుపాయం ఉండగా, ఇప్పుడిక వ్యక్తుల నుంచి వచ్చే చాట్ మెసేజ్ లనూ 'మ్యూట్' చేసుకోవచ్చు. దీంతో పాటు కాల్స్ చేసేటప్పుడు క్వాలిటీని మార్చుకోవడం ద్వారా తక్కువ డేటాను వినియోగించేలా కొత్త ఫీచర్లు ఈ వర్షన్లో ఉన్నాయి. ఓ మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా దాన్ని రీడ్ లేదా అన్ రీడ్ అని మార్క్ చేసుకోవచ్చు. వీటితో పాటు కొత్త 'ఎమోజీ'లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి రంగులను కూడా ఇష్టానుసారం మార్చుకోవచ్చు. కొత్తగా వచ్చే మెసేజ్, కాంటాక్టులను వేగంగా సేవ్ చేసుకునేందుకు సదుపాయాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News