: ఏపీలో మరో ‘హోదా’ ఆత్మహత్య... నెల్లూరులో సూసైడ్ చేసుకున్న లక్ష్మయ్య
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. మొన్న ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జరిపిన చర్చలు సఫలం కాలేదు. 'ప్రత్యేక హోదా మినహా ఏదైనా అడగండి' అని చెప్పడమే కాక ‘హోదా’ కోటాలో అందే నిధుల కంటే అధికంగానే సహాయం చేస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు స్వరం పెంచాయి. ఆందోళనలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరులోని వేటాయపాలెంకు చెందిన లక్ష్మయ్య ఏపీకి ప్రత్యేక రాదేమోనన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.